calender_icon.png 3 May, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిట్4 హీరోగా కార్తి!

02-05-2025 12:00:00 AM

‘హిట్’ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన తాజా చిత్రం ‘హిట్3’. నాని హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇందులో కోలీవుడ్ నటుడు కార్తి అతిథి పాత్రలో నటించారంటూ ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ‘హిట్3’ విడుదల కావటంతో ఆ వార్తలకు క్లారిటీ లభించింది. కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ సినిమా క్లుమైక్స్‌లో కార్తిని చూపించారు.

రత్నవేల్ పాండియన్ అనే పోలీస్ అధికారిగా ఆయన స్క్రీన్‌పై కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ శ్రీ గురజాడ అప్పారావు చెప్పిన కవిత్వాన్ని తన స్టుల్‌లో చెప్తూ ఆయన ఎంట్రీ ఇచ్చారు. కార్తి ఎంట్రీకి సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.