20-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
శివంపేట, ఆగస్టు 19 : భారీ వర్షాలు వరదల కారణంగా కోతకు గురైన నీటి కాలువకు యుద్ధ ప్రాతి పతికిన తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం శివంపేట మండలం ఉసిరికపల్లి వెళ్లే దారిలో వర్షాల వల్ల రోడ్డు చెడిపోవడంతో ఆర్‌అండ్ బి అధికారులతో పరిశీలించిన అనంతరం గుండ్లపల్లి పొలాల్లోకి నీటి కాల్వ తెగిపోయిన దాన్ని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొంగుతున్న వాగులు చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాల గురి కావద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి తిరగవద్దని సూచించారు. గండ్లపల్లి పొలాల్లో నీటి కాలువ గండిని పరిశీలిస్తూ తాత్కాలిక మరమ్మతులపై దృష్టి పెట్టామని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి రైతుల పొలాలకు వరద నీటి వలన ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. దెబ్బతిన్న నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు.