11-10-2025 02:11:05 AM
నల్గొండ టౌన్, అక్టోబర్ 10: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెగిపోయిన హాలియా మండలం, పేరూరు వంతెన; తాత్కాలిక పునరుద్ధరణకు అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి; పేరూరు గ్రామ శివారులో తెగిపోయిన వంతెనను పరిశీలించారు.
ఇంజనీరింగ్ అధికారులు, గ్రామస్తులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వంతెన తెగిపోవడం వల్ల ప్రజల రవాణాకు, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే తాత్కాలిక; చర్యలు చేపట్టాలని,; పేరూరు వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని, శాశ్వత ప్రాతిపదికన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
40 సంవత్సరాల కు పూర్వం నిర్మించిన ఈ వెస్టడ్ కాజ్ వే పై అటువైపు నుండి మదారి గూడెం, ఇటువైపు పేరూరు గ్రామాలను కలుపుతుంది .అయితే; చుట్టుపక్కల ఉన్న ఏడేనిమిది గ్రామాల ప్రజలు కూడా ఈ వంతెన తెగిపోవడం కారణంగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రజలు; జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు పోయారు. అనంతరం హాలియా తహసిల్దార్ కార్యాలయంలో పలు అంశాలపై; ఎమ్మెల్యేతో కలెక్టర్; చర్చించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలిక వంతెనకు తక్షణ చర్యలు చేపట్టాలని; శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి సూచించారు.;;మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ,ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేందర్,డి ఈ సతీష్,ఏ ఈ సాయి రెడ్డి,మున్సిపల్ కమిషనర్ రామ్ దుర్గా రెడ్డి,తహసిల్దార్ రఘు, ఎంపీడీవో సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,; తదితరులు ఉన్నారు.