calender_icon.png 11 October, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

11-10-2025 02:07:50 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్10: తెలంగాణ రాష్ర్టంలో బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేందుకు అగ్రకులాలు కుట్ర చేస్తున్నాయని విద్యా,ఉద్యోగ,రాజకీయ రంగాలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలను బందు చేసి,ప్రధాన చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ జిల్లా కో-ఆర్డినేటర్ నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు.రాష్ర్ట ప్రభుత్వం గవర్నర్ పై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేయించాలన్నారు.

42శాతం వాటా అమలయ్యే వరకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బెల్లి వీరయ్య, రావుల వినయ్,కడారి సతీష్,గణేష్,కాసం యాకస్వామి తదితరులు పాల్గొన్నారు.