20-01-2026 12:36:02 AM
ఫిబ్రవరి 4 వరకు బిడ్ల స్వీకరణ
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి) : రాష్ట్రంలో నైపుణ్య విద్యకు పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ, తెలంగాణ ప్రాజెక్టు వేగం పుంజుకుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సమగ్ర అభివద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) టెండర్లు ఆహ్వానించింది. ఈ మేర కు సోమవారం టీజీఐఐసీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం అధికారికంగా టెండర్ నోటీ సు జారీ చేసింది.
ప్రాజెక్టు ఆర్థిక వివరాలు
ఈ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.55,52,41,700 అంచనా వ్యయంగా నిర్ణయించింది. ఇది తొలి దశ మౌలిక సదుపాయాల అభివృద్ధిగా భావిస్తున్నారు. తర్వా తి దశల్లో అకడమిక్ భవనాలు, హాస్టళ్లు, ట్రైనింగ్ సెంటర్లు, పరిశోధనా కేంద్రాలు నిర్మించే అవకాశం ఉంది. ఆసక్తి గల కాంట్రాక్టర్లు 21 జనవరి 2026 సాయంత్రం 5 గంటల నుంచి బిడ్ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. బిడ్లు సమర్పించడానికి చివరి తేదీ 4 ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 3 గంటల వరకు అని అధికారులు తెలిపారు.
ఎవరెవరికి టెండర్ కాపీలు?
స్కిల్ వర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ టెండర్ నోటీసు కాపీలు ఆయా శాఖ అధికారులకు పంపినట్లు టీజీఐఐసీ వెల్లడించింది. సైబరాబాద్, శంషాబాద్, వరంగల్, కరీంనగర్, పటాన్‌చెరు, మేడ్చల్, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, యాదాద్రి జోనల్ మేనేజర్లు, టీజీఐఐసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పేషీ నోటీస్ బోర్డు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, టీజీఐఐసీ చైర్మన్ పేషీ, ఎంఐఎస్ విభాగం, జనర ల్ మేనేజర్ (ఫైనాన్స్) కార్యాలయా ల్లో నోటీసులు అందుబాటులో ఉంటాయి. టెండర్ ప్రక్రి య పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ ఎంపిక చేసి పనులు ప్రారంభించనున్నారు.