16-07-2025 12:53:47 AM
మల్కాజ్గిరి, జులై 15 : మల్కాజ్గిరి లో మంగళవారం రాత్రి ఉద్రుక్త పరిస్థితి ఏర్పడింది. అల్వాల్లో ఉదయం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య చెలరేగిన ఘర్షణల ప్రభావం ఒక్కసారిగా మల్కాజ్గిరి వరకు పాకడంతో ఇరు పార్టీల నాయకులు పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజుకున్న రాజకీయ వివాదం ఇంకా చల్లారలేదు.
అల్వాల్లో మొదలైన ఘర్షణలు మల్కాజిగిరి వరకు పాకడంతో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నేలకొంది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటూనే ఉన్నారు. ఈ ఘటనలతో మల్కాజిగిరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన అనంతరం ‘దమ్ముంటే మల్కాజిగిరి రా‘ అంటూ బీఆర్‌ఎస్ నాయకు లు కాంగ్రెస్ శ్రేణులకు సవాల్ విసిరారు.
దింతో ఈ సవాల్ స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కుమారుడు మైనంపల్లి రోహిత్, పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్దఎత్తున మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుం దో తెలియని పరిస్థితి నేలకొంది దీనితో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు.