calender_icon.png 25 September, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామ్మో.. రోడ్డంతా గుంతల మయం

25-09-2025 03:08:05 PM

రాకపోకలకు అంతరాయం

పట్టించుకోని అధికారులు- 

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

నకిరేకల్, (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్డు చీమల గడ్డ ఫ్లైఓవర్ బ్రిడ్జి(Chimalagadda Flyover Bridge) ఇరువైపులా నిర్మించిన సర్వీస్ రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారాయి. ఈ గుంతలు ప్రమాదాలకు నిలయంగా ఉన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దీంతో వాహనదారులు ఈ రోడ్డు వెంబడి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. 

 పెద్ద వాహనాలు, లోడింగ్ వెహికిల్స్ వెళ్లాలంటే గుంతలలో ఇరుక్కుని ఫల్టీకొట్టే ప్రమాదాలు ఉన్నాయి.  నేషనల్ హైవే అధికారులు  రోడ్డుకు అప్పుడప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసి మామ అనిపించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.గుంతులు ఏర్పడి నెలలు గడుస్తున్నా నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ సర్వీస్ రోడ్డు వెంట డ్రయినేజీ కాలువలు నిర్మించారు. వర్షాలు వచ్చాయంటే డ్రయినేజీ నీరంతా ఈ రోడ్ల వెంబడి ప్రవహించడంతో గుంతలు మరింతగా లోతుగా వెడల్పుగా మార్యాయి. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని  శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు..