నేటి నుంచి టెన్త్ హాల్‌టికెట్లు
05-03-2026 12:24 AM
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): నేటి నుంచి టెన్త్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాట్సాప్ నెంబర్లకు సైతం హాల్‌టికెట్లు పంపిస్తామని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు పీ.శ్రీహరి తెలిపారు. 8096958096 నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పంపిస్తే వాట్సా ప్‌కు హాల్ టికెట్ వస్తుందని, లేదంటే అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.




