23 May, 2026 | 12:54 AM

డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల ప్రాణాలకు హాని

23-05-2026 12:00 AM

ముకరంపుర, మే 22 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ లోగల డంపింగ్ యార్డు వల్ల నగర ప్రజలకు ప్రాణహాని ఉందని, డంపింగ్ యార్డు శాశ్వ త పరిష్కారం చూపని పాలకులపై దశల వారిగా ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం.ఎల్.మాస్ లైన్, బిఆర్‌ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నాయకులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గుడికందుల సత్యం, జంగిలి ఐలెందర్ యాదవ్, జిందం ప్రసాద్, కొక్కిరాల సత్యారావు వెల్లడించారు.

శుక్రవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో డంపింగ్ యార్డు సమస్యతో ప్రజలేదుకొంటున్న ఇబ్బందులు - శాశ్వత పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ తరలింపు పై, దీర్ఘ కాలిక పరిష్కారం కోసం, ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం ఐక్యంగా ప్రజల భాగస్వామ్యంతో పోరాటాలు నిర్వహిస్తామని, త్వరలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో న్యాలపట్ల రాజు, టేకుమల్ల సమ్మయ్య, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, బూడిద సదాశివ, బాకం ఆంజనేయులు, నాయిని సురేష్, తదితరులు పాల్గొన్నారు.