16 August, 2026 | 8:58 PM

పర్యావరణ రక్షకులు... పారిశుద్ధ కార్మికులు

16-08-2026 08:21 PM

పారిశుద్ధ్య కార్మికుల... సేవలు వెలకట్టలేం.                  

బీజేవైఎం అధ్యక్షులు శశాంక్ సింగ్..  

జవహర్ నగర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని వారు ప్రకృతికి పర్యావరణానికి రక్షకులని  బీజేవైఎం అధ్యక్షులు శశాంక్ సింగ్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో మేడ్చల్ రూరల్ జిల్లా జవహర్ నగర్ డివిజన్లో బీజేవైఎం అధ్యక్షులు డివిజన్ బిజెపి అధ్యక్షులు కలికోట కమలాకర్ సమక్షంలో ఆదివారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శశాంక్ సింగ్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు జవహర్ నగర్ పారిశుద్ధ్య కార్మికుల విషయంలో నిర్లక్ష్యం చేశాయని జవహర్ నగర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన ఆ తర్వాత మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ గా మారినా వారి జీవితాల్లో మార్పు రాలేదని తెలిపారు. 

ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇప్పటివరకు పారిశుధ్య కార్మికుల విషయంలో ఏమి న్యాయం చేయలేదని దుయ్యబట్టారు. ముఖ్యంగా కార్మికులకు జీతాలు పెంచాలని ఉద్యోగాలు పెర్మనెంట్ చేయాలని మౌలిక వస్తువులైన గ్లౌజులు, బూట్స్, రైన్ కోట్స్, మాస్కులు తదితర సామాగ్రిని అందజేయాలని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని వారికి పెన్షన్స్ సౌకర్యాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు గొడుగులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు తులసిరాం అమర్ రవి అనిల్ అరుణ్ కుమార్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.