24 March, 2026 | 7:14 AM

భారత్‌కు రానున్న మరో రెండు నౌకలు

24-03-2026 12:55 AM

హోర్ముజ్‌ను దాటేందుకు సిద్ధమైన ఎల్పీజీ ట్యాంకర్లు

టెహ్రాన్, మార్చి 23: అమెరికా -ఇరాన్ మధ్య నడుస్తున్న యుద్ధ ఉద్రిక్తతల నడుమ హోర్ముజ్ జలసంధిని దాటేందుకు మరో రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు సిద్ధమయ్యాయి. షిప్ -ట్రాకింగ్ డేటా ప్రకారం.. భారత జెండా కలిగిన మరో రెండు ఎల్పీజీ నౌకలు పర్షియన్ గల్ఫ్ నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇవి ఘర్షణలతో అట్టుడికిపోతున్న హోర్ము జ్ జలసంధిని దాటి భారత ఓడరేవులకు చేరుకోనున్నాయి.

పైన్ గ్యాస్, జగ్‌వసంత్ అనే ఈ నౌకలు సోమవారం మధ్యాహ్నం ఇరాన్‌కు చెందిన లారాక్, ఖేష్మ్ దీవుల మధ్య జలాల సమీపంలో ప్రయాణిస్తున్నా యి. ఈ వ్యూహాత్మక కీలక ప్రాంతాన్ని దాటే ముందు, ఇరాన్ అధికారులకు తమ గుర్తింపు, భద్రతను సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. జలసంధికి పశ్చిమ వైపున ఉన్న భారత జెండా కలిగిన 22 నౌకలలో, ఆరు ఎల్పీజీ రవాణా నౌకలు ఉన్నాయి. వాటిలో రెండు ఇప్పుడు బయలుదేరి, భారతదేశం వైపు పయనిస్తున్నాయి.