calender_icon.png 20 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కమిటీలో బీసీ ఎస్సీ ఎస్టీ లకు సముచిత స్థానం

20-08-2025 12:36:59 AM

బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి 

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): బిజెపి జిల్లా నూతన కమిటీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ, లకు 70% సముచిత స్థానం కల్పించామని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో నూతనంగా నియమితులైన జిల్లా పదాధికారులతో సమావేశం నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామన్నారు.  స్థానిక సంస్థల  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరేస్తామని అన్నారు.