calender_icon.png 21 January, 2026 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్బన్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ అభివృద్ధి చేయడమే లక్ష్యం

21-01-2026 12:35:15 AM

అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్ జనవరి 20 (విజయక్రాంతి): నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్  సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 16, 17, 37, 38, 39, 21, 44, 46 వ డివిజన్లో పరిధిలో నీ పలు ప్రాంతల్లో టి యు ఎఫ్ ఐ డి నిధుల కింద డివిజన్ కు కోటి రూపాయలు చొప్పున అభివృద్ధి పనులకు అర్బన్ ఎమ్మెల్యే భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన అర్బన్ ఎమ్మెల్యే కు ప్రతి డివిజన్లో ప్రజలు స్వాగతం పలికి తమ కాలనీలో అభివృద్ధి పనుల ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లో ప్రతి డివిజన్లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి అర్బన్ నియోజకవర్గం ప్రజలు మద్దతు పలికి బిజెపి పార్టీని మెజార్టీ స్థానాల్లో గెలిపించాలని ఎమ్మెల్యే గారు కోరారు. ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ డిఇ మరియు ఇంచార్జ్ మునిసిపల్ నగేష్ రెడ్డి మరియు పబ్లిక్ హెల్త్ ఏఇ లు శివకృష్ణ శంకర్ తదితరులు పాల్గొన్నారు.