01-10-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించినందున సోమవారం నుండి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లా డారు.
జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలోని 23 మండలాల జడ్పిటిసిలకు, 235 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 486 గ్రామపంచాయతీలకు, 4388 వార్డు సభ్యులకు ఎన్నికలు ఉంటాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, మొద టి విడత సూర్యాపేట డివిజన్ సంబంధించి అక్టోబర్ 9న, 2 వ విడత కోదాడ, హుజూర్నగర్‌కు సంబంధించిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 4403 పోలింగ్ కేంద్రాలు, ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఎన్నికలకు 1272 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశమన్నారు. 541 పోలింగ్ లొకేషన్లు ఉండగా, 3,40,743 మంది పురుష ఓటర్లు, 3,54,050 మంది మహిళా ఓటర్లు ,మొత్తం కలిపి 6,94,815 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, స్టేజి వన్, స్టేజ్ 2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశావన్నారు. ఆర్‌ఓ, పిఓ శిక్షణ కార్యక్రమాలు మండలాల వారిగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
మీడియాలో వచ్చే చెల్లింపు వార్తల ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంద న్నారు. మీటింగ్ లు, ర్యాలీలు, ముందస్తు అనుమతి తీసుకోవాలని, నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎలాంటి ప్రభుత్వ పథకాల మంజూరు, గ్రౌండింగ్, ప్రారంభోత్సవాలు ఉండవని, జిల్లా కలెక్టర్ మొదలుకొని కిందిస్థాయి వరకు అందరు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తార న్నారు.
ఎన్నికలను సక్రమంగా నిర్వహించేం దుకు జిల్లా యంత్రాంగం మొత్తం సంసి ద్దంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామా రావు, జడ్పీ సీఈఓ అప్పారావు, డిపిఓ యాదగిరి, నల్గొండ అసిస్టెంట్ డైరెక్టర్, సూర్యాపేట డిపిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా సమాచార ఇంజనీర్ మల్లేశం, డిప్యూటీ సీఈఓ శిరీష, డివిజనల్ పంచాయతీ అధి కారి నారాయణరెడ్డి పాల్గొన్నారు.