17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలి

14-06-2025 07:58 PM

యంఆర్పియస్ జిల్లా కార్యదర్శి బొడ్డు కుటుంబరావు..

మోతె: రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు కుటుంబరావు(MRPS District Secretary Boddu Kutumbarao) అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... మందా కృష్ణ మాదిగ ముప్పై సంవత్సరాల వర్గీకరణ పోరాటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వర్గీకరణ చేయడంతో మాదిగలకు కొంత మేరకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

నేడు మన ముందు రాజ్యాధికారం అనే లక్ష్యం ఉన్నదని కృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ సైనికుల వలె పని చేయాలని కోరారు. ఈ నెల 15 నుంచి 20 వ తేది వరకు మండలం లోని ప్రతి గ్రామం లో యం ఆర్ పి యస్ గ్రామ కమిటీల నిర్మాణం చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో యం ఆర్ పి యస్ జిల్లా సీనియర్ నాయకులు మారపంగు రామంజయ్య మాదిగ, యం జె ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పల్లెల లక్ష్మణ్, యం ఆర్ పి యస్ మండల నాయకులు బొర్రా మధు సుధన్, దోసపాటి చిరంజీవి, కొండ వెంకన్న, డి. ఉపేందర్, యు. సైదులు, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.