15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు కార్మిక వర్గ పోరాటాలు ఆగవు

14-06-2025 07:56 PM

జులై 9న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం అవుదాం..

కామ్రేడ్ భూపాల్, తుమ్మల వీరారెడ్డి పిలుపు..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేసేవరకు మోడీ ప్రభుత్వంపై కార్మికవర్గం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్(CITU State Vice President Comrade Bhopal) పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని  దొడ్డి కొమరయ్య భవన్లో సీఐటీయూ నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు.

వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటు వంటి 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారని అన్నారు.ఈ కోడ్స్ వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు,సంఘం పెట్టుకునే హక్కు, జీతభత్యాల కోసం భేరసారాల హక్కు కోల్పోతారన్నారు. పనిగంటలు విపరీతంగా పెరుగుతాయన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ... కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆశ వివోఏ మధ్యాహ్న భోజనం అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని అసంఘటితరంగా కార్మికులకు కార్మికులకు సంక్షేమ బోర్డు లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె మోడీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం అవుతుందని హెచ్చరించారు.

సమ్మె జయప్రదానికి జిల్లాలో  జూన్ 15 నుండి 20 వరకు యూనియన్ జనరల్ బాడీ లు జరపాలని ,జూన్ 20 నుండి 24 వరకు యాజమాన్యాలకు ప్రభుత్వ అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని జూన్ 25 నుండి 30 వరకు నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశాలు నిర్వహించి కార్మికుల్లో సమ్మె స్ఫూర్తిని పెంచాలని అన్నారు. జూలై మొదటి వారంలో జూలై 9 సమ్మె జయప్రదం చేయాలని కరపత్రాల పంపిణీ బైక్ ర్యాలీలు జరిపి జూలై 9న ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో జిల్లా మండల పట్టణ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపాలని పిలుపునిచ్చారు. 

సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికారు మల్లేష్, ప్రమీల, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, అవుత సైదులు, సహాయ కార్యదర్శిలు   దండెంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయన్న,నల్లా వెంకటయ్య, ఏర్పుల యాదయ్య,  కానుగు లింగస్వామి, పెంజర్ల సైదులు, వంటపాక వెంకటేశ్వర్లు, జిట్టా నగేష్, దయానంద, దనంజయ్  తదితరులు పాల్గొన్నారు.