calender_icon.png 18 December, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం

18-12-2025 09:04:31 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. తుది విడతలో 4,159 స్థానాలకు 2,246 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా, చివరి విడతలో 1,163 స్థానాలు బీఆర్ఎస్ మద్దతుదారులు, ఆఖరి విడతలో 246 స్థానాలను బీజేపీ మద్దతుదారులు, 491 స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, సిద్ధిపేట మినహా మిగిలిన 30 జిల్లాలోనూ ఆధిక్యం సాధించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో మూడు విడతల్లో 12,728  గ్రామాలకు 11,497 గ్రామా లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 1,205 గ్రామాలు ఏకగ్రీవం కాగా, 21 గ్రామాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 38,394 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. 1,12,242 వార్డులకు గా ను 25,848 వార్డులు ఏకగ్రీవం కావడంతో 85,955 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి 2,12,251 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

12,728 సర్పంచ్ పదవుల్లో కాంగ్రెస్ 6,822 స్థానాలు, బీఆర్ఎస్ 3,519 స్థానాల్లో విజయం సాధించాయి.  చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్ కాగా, మొత్తం మూడు విడతలకు కలిపి 85.30 శాతం పోలింగ్ నమోదైంది. 1,205 పంచాయతీల్లో పోటీ లేకుండానే సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికోబడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఈనెల 22న బాధ్యతలు స్వీకరించనున్నారు.