calender_icon.png 2 August, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య రాజకీయ రణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలి

29-07-2025 10:37:12 PM

జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర రావు..

సూర్యాపేట (విజయక్రాంతి): ఆగస్టు మూడవ తేదీన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే ఆర్యవైశ్య రాజకీయ రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు(District Arya Vysya Sangam President Vempati Venkateswara Rao) అన్నారు. స్ధానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు జరిగిన వైశ్య రాజకీయ రణభేరి గోడ పత్రికను ఆర్యవైశ్య నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీల తరఫున ఆర్యవైశ్యులు పోటీల్లో నిలబడాలని ఏ పార్టీ టికెట్ ఇవ్వకున్నా స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆర్యవైశ్యులకు జనాభా ప్రాతిపదికన రాబోయే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు మూడవ తేదీన వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాసం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్య సంఘం మాజీ అధ్యక్షులు కర్నాటి కిషన్, పొలిటికల్ జేఏసీ చైర్మన్ కక్కిరేణి శ్రీనివాస్, క్రమశిక్షణ సంఘం చైర్మన్ బండారు రాజా, కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, నాయకులు కక్కిరేణి చంద్ర మోహన్, తప్సి గాంధీ, కలకోట లక్ష్మయ్య, గుండా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.