29-07-2025 10:33:36 PM
జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు..
గరిడేపల్లి (విజయక్రాంతి): ఆగస్టు ఒకటిన హుజూర్నగర్ లో జరిగే చేయూత పెన్షన్ దారుల జిల్లా స్థాయి సన్నహాక సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల సూర్యాపేట జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ(In-charge Bachalakuri Venkateswarlu Madiga) అన్నారు. మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గరిడేపల్లి మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల బలోపేతం చేయడానికి గ్రామస్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెనీఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4 వేల రూపాయలు, వికలాంగులకు 6000 వేల రూపాయలు,పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారికి 15 వేల రూపాయల పెన్షన్ పెంచాలని ఆగస్టు13 న హైదరాబాదులో జరిగే వికలాంగుల ఆసరా పెన్షన్ ల మహాగర్జన సభను జయప్రదం చేయుట కొరకై ఆగస్టు ఒకటిన హుజూర్నగర్ లో వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహాసభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు పాల్గొని జయప్రద చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎం.ఆర్.పి.ఎస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ, ఎం.ఎస్.పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి ప్రసాద్ మాదిగ, ఎం.జె.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఒగ్గు విశాఖ,ఎం.ఎస్.పి నియోజకవర్గ నాయకులు గుండె పొంగు బాబు తదితరులు పాల్గొన్నారు.