29-07-2025 10:40:15 PM
ఎరువుల కొరత లేదు: జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్..
పటాన్ చెరు (విజయక్రాంతి): మండల కేంద్రం జిన్నారంతో పాటు సోలక్ పల్లి గ్రామాలలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్(District Agriculture Officer Siva Prasad) మంగళవారం తనిఖీ చేశారు. రైతులకు అమ్ముతున్న ఎరువులు నిల్వ ఉంచిన ఇతర బస్తాలు పరిశీలించారు. అనంతరం డీఏపీ, ఎంఓపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువుల అమ్మకాలకు సంబంధించిన రికార్డు పుస్తకాలను, స్టాక్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎరువుల దుకాణాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో సరిపడా ఎరువుల బస్తాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని చెప్పారు. ఎరువుల స్టాక్, ఎమ్మార్పీ ధరల వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని దుకాణం నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి, ఏఈఓ దామోదర్ రైతులు పాల్గొన్నారు.