సరోజారాయ్‌కి అభినందనల వెల్లువ
28-06-2024 01:41 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి) : ప్రముఖ యువ హిప్నాటిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ సరోజారాయ్‌ను బెంగుళూరు ఏవియేషన్ సైంటిస్ట్ ప్రొఫెసర్ సీహెచ్ ఎన్ సౌగంధి అభినందించారు. సరోజారాయ్‌కి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీలో హ్యూమన్ ఫ్యాక్టర్స్ సైకాలజీ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్ లభించడంతో ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ హిప్నాటిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ పాల్గొన్నారు.




