calender_icon.png 25 December, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దులో అక్రమ రవాణాలను అరికట్టాలి

24-12-2025 12:00:00 AM

ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి) :  మహారాష్ట్ర సరిహద్దు నుండి అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా అడ్డుకట్ట వేయగలరని ఎస్పీ అఖిల్ మహోజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం గాదిగూడ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సందర్శించి, తనిఖీలు చేపట్టారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క ను నాటి నీరు పోశారు. సిబ్బంది చే పరేడ్ నిర్వహించి పరేడ్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్క పోలీస్ విధులలో నీతి నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

గ్రామాలను సందర్శిస్తూ విపిఓ విధా నాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపా రు. మహారాష్ట్ర సరిహద్దు గుండా రాయితీ బియ్యం, గుడుంబా, గంజాయి తరలకుండా చర్యలు చేపట్టాలని, మండల పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలించాలని ఆదేశించారు. వాటి వల్ల కలిగే అనార్థాలపై ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు పెండింగ్‌లో ఉన్న రికా ర్డులు త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్ షీటు దాఖ లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూ ర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఎస్‌ఐ ప్రణయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.