calender_icon.png 31 July, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గానికి బేతంపూడి ప్రాజెక్టు ఆయువుపట్టు

31-07-2025 12:00:00 AM

- ‘నీరు’కారి పోతున్న ఆధరణ

- పట్టింపులేక పడావు పడనున్న ఆయకట్టు

- సీతారామ ప్రాజెక్టు నీరు ఇక వచ్చేనా..?

ఇల్లెందు/టేకులపల్లి, జులై 30, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో బేతంపూడి ప్రాజెక్టు ఆ యువుపట్టు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉ న్నప్పుడు 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కృషితో టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ సమీపంలోని రోళ్లపాడు అడవుల్లో రెండు గుట్టల మధ్య నిర్మించారు. దానికి అప్పట్లోనే కుడి, ఎడమ కాలువలతో మొత్తం 2042 ఎకరాల ఆయకట్టుతో నిర్మాణం చేపట్టారు.

కుడి కాలువ కింద 942 ఎకరాలు, ఎడమ కాలువ కింద 1100 ఎకరాలు సాగవ్వాలి. కుడి కాలువ ద్వారా బేతంపూడి, కోటల్ల, తొమ్మిదోమైలుతండా, టేకులపల్లి పరిసర గ్రామాల భూ ములకు నీరందే విధంగా డిజైన్ చేయగా, ఎడ మ కాలువకు అక్విడెక్ట్ నిర్మించి ప్రాజెక్టు ఎడమ వైపు గుట్టల పక్కనుంచి అబ్బిరెడ్డిగూడెం, మద్దిరాలతండా, మద్దిరాల మీదు గా వ్యవసాయ భూములకు నీరుస్తూ, మద్దిరాల ఆనకట్టలో నీరు కలిపే విధంగా నిర్మా ణం చేశారు. మద్దిరాల ఆనకట్ట నుంచి కాలువను కుంటల్ల, దాసుతండా, టేకులపల్లి వర కు ఉన్న భూములను సస్యశ్యామలం చేసేందుకు కాలువలు నిర్మించారు.

అప్పటి నుంచి కొంతకాలం కుడి కాల్వకు అక్కడక్కడ దుం గలు ఏర్పడి నిత్యం నీరు కారి వాగులో కలిసేవి. తర్వాత ఎడమ కాలువ అక్విడెక్టు కుప్ప కూలి రెండేళ్లపాటు పంటలు పండక పోవ డం జరిగింది. ఆతర్వాత అక్కిడెక్టును మరమ్మతులు చేయడం అప్పుడప్పుడు దానికి దుంగలు ఏర్పడటం సర్వసాధారణమైంది. రెండు కాలువలతో అనుకున్న లక్ష్యాలను సా ధించడం విఫలమయిందనే చెప్పొచ్చు. బే తంపూడి ప్రాజెక్టు నిండుకొని, కాలువులు నిండుగా ప్రవహిస్తే సమీపంలోని మంచినీళ్లకుంట, ఇతర కుంటలు కూడా నిండి తగిన ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఏటా సగానికి పైగా ఆయకట్టుకు నీరందని పరిస్థితే ఉండటం విశేషం.

2016లో సీతారామ ప్రాజెక్టు అభివద్ధి పేరుతో శంకుస్థాపన..

తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక 2016లో సీతారామ ప్రాజెక్టుతో అభివృద్ధి చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు గ్రామ సమీపంలో శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా బేతంపూడి ప్రాజెక్టులోకి నీటిని తెచ్చి పాలేరు జలాశయం కంటే ధీటుగా నీరందే విధంగా డిజైన్ చేస్తున్నట్లు ప్రకటించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలువల నిర్మాణ పరిస్థితిని పాలకులు మరి పోయారు. అంతకు ముందే ఇదే ప్రాజెక్టుకు పైపులైన్ ద్వారా గోదావరి జలాలు తరలించాలని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమయంలో పైపులైను పూర్తిగా వేసినా, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కొరకని, వాటిని తొలగించి, వేరే ప్రాంతానికి తర లించారు.

సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణంతో బేతంపూడి ప్రాజెక్ట్ నిండుకొని రోళ్లపాడు గ్రామం మునిగి పోతుందని ప్రత్యామ్నాయంగా ఆ గ్రామాన్ని తరలించేందుకు స్థలాల సేకరణకు కూడా శ్రీకారం చుట్టారు. ఐన అది తుది రూపం దాల్చలేదు. దీనితో బేతంపూడి ప్రాజెక్ట్ రొంట చెడె రాముని కథగా మారింది. ఎన్నో ఆశలతో బేతంపూడి ప్రాజెక్టుతో లక్ష ఎకరాల భూమి సగవ్వనుందని చెప్పడంతో ఆశ పడ్డ రైతులకు ఉన్న భూములకు నీరొచ్చే పరిస్థితి లేకుండా పో యింది. రెండు కాలువలను మరమ్మతులు చూపిస్తే అదే ధన్యం అంటున్నారు ఆయక ట్టు రైతులు.

నీరు వృధా పోకుండా రెండు కాలువలను మరమ్మతులు చేయించాలని, అదను సమయంలో కాకుండా వేసవిలోనే మరమ్మతులు చేపడితే రైతులకు ఇబ్బందు లు ఉండవంటున్నారు.తెగిన అక్విడెక్ట్ కు రై తులే మరమ్మతులు.వారం క్రితం బేతంపూ డి ప్రాజెక్ట్ ఎడమ కాలువ అక్విడెక్టు కొంత భాగం కుప్పకూలిన విషయం తెలిసిందే. దా ని మరమ్మతులను ఆయకట్టు రైతులు ఇసు క బస్తాలు వేసుకొని నాట్లు వేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సంబంధిత అధికారు లు పట్టించుకోలేదని వాపోతున్నారు.

అక్విడెక్టు మరమ్మతులకు రూ.17 లక్షలు మంజూరి : ఏఈ 

బేతంపూడి ప్రాజెక్ట్వి ఎడమ కాలువ మ ర్మతుల కొరకు రూ. 95 లక్షలతో అంచనా వేసి పంపగా రూ.17 లక్షలు మంజూరి అ య్యాయని ఐబి ఏఈ రవికుమార్ ‘విజయక్రాంతి‘ కి తెలిపారు. టెండర్ ప్రక్రియ కాగానే వచ్చే ఏడాది పనులు పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అక్విడెక్టు మరమ్మతులు చేపడుతున్నామన్నారు.