calender_icon.png 1 August, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సైబర్ వారియర్స్’కు సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన

31-07-2025 12:00:00 AM

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

నిజామాబాద్ జులై 30: (విజయ క్రాంతి): నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు అంత వేగవంతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి పోలీస్ సిబ్బంది సైబర్ క్రైమ్ రంగంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం. అని నిజామాబాద్ సిపి సాయి చైతన్య అన్నారు. బుధవారం రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ లో సైబర్ వారియర్స్ కి సైబర్ నేరాల మీద వాటి నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సైబర్ వారియర్స్ ని ఉద్దేశించి సాయి చైతన్య మాట్లాడుతూ.. సైబర్ నేరాలు నిరోధించేందుకు ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని ఫిషింగ్, వేరియంట్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలు వంటి నూతన పద్ధతులపై అప్రమత్తంగా ఉంటూ ప్రతి కేసును సీరియస్గా తీసుకుని బాధితులకు తక్షణమే న్యాయం కల్పించాలన్నారు. 

ఈ నేరాలపై ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. * 1930 https://www .cybercrime.gov.in  నెంబర్  ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని బందిని ఆదేశించారు. సైబర్ నేరాలపై సమగ్ర అవగాహనతోనే సమర్థవంతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని. అందుకే పోలీస్ సిబ్బంది నిరంతరం నూతనమైన జ్ఞానం అలవర్చుకొని ఉండాలన్నారు.

ఇప్పటి వరకు నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలో తేది: 1-1-2024 నుండి తేది : 29-7-2025 వరకు మొత్తం 759 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా  రూ: 3,27,12,397-84 రూపాయలు కోర్ట్ ల ద్వారా సంబంధిత భాధితులకు డబ్బులు ఇప్పించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేటటువంటి సైబర్ వారియర్స్ అందరికీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ వారి ‘ టీ షరట్స్ ‘ ను అందించారు.

ఈ కార్యక్రమంలో వై. వెంకటేశ్వరరావు, డిఎస్పీ సైబర్ క్రైమ్ పిఎస్ , మహమ్మద్ ముఖిద్ పాషా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ , ఎం ప్రవళిక సబ్ ఇన్స్పెక్టర్ , శ్రీనివాస్ , శ్రీరామ్ , సురేష్ , నాగభూషణం , నరేష్ , ప్రవీణ్ , రాఘవేంద్ర, సుమలత , శృతి , రమ్య , సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.