calender_icon.png 27 June, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిత సెంటర్ ను మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలి

27-06-2025 02:20:46 AM

నల్లగొండ టౌన్, జూన్ 26: భవిత సెంటర్ ను మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలో కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన భవిత సెంటర్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి, మరింత సౌకర్యాలు అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు.

స్పీచ్ థెరపీ సౌకర్యానికి కూడా అంగీకారం తెలిపారు. ఇప్పటికే ఫౌండేషన్ తరఫున 10 లక్షలు, కలెక్టర్ నిధుల ద్వారా 7 లక్షలతో అభివృద్ధి పనులు జరిగాయి. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.