29-12-2025 01:51:47 AM
రామచంద్రపురం(పటాన్చెరు), డిసెంబర్ 28 :పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతరలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలని, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.
అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, రాగం దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కురుమ సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.