దేశాభివృద్ధిలో బీజేపీదే కీలక పాత్ర
ఎమ్మెల్యే డా. హరీశ్‌బాబు
కుమ్రం భీం ఆసిఫాబాద్ / కాగజ్‌నగర్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): దేశాభివృద్ధిలో బీజేపీదే కీలక పాత్రని, గ్రామ గ్రామాన పార్టీ ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్‌బాబు పేర్కొన్నారు. బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణం సర్సిల్‌లోని తన ఎమ్మెల్యే నివాసంలో బీజేపీ జెండాను ఎగురవేశారు.
జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్ రావుతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరభద్ర చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున యాదవ్, కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్ రావు, గజ్జల లావణ్య లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ సింధం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, బాల్క శ్యామ్, భాజపా పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చిప్పకుర్తి శ్రీనివాస్, సొల్లు లక్ష్మి, కృష్ణ కుమారి, కేసరి ఆంజనేయులు గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ మెరుగు శంకర్, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు సుంకరి పెంటన్న తదితరులు పాల్గొన్నారు.




