calender_icon.png 13 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతల అరిగోస!

13-11-2025 12:52:23 AM

-అకాల వర్షాలతో ఆగమాగం

-చేతికొచ్చిన పంట నీటిపాలు

-మిగిలిన పంట అమ్ముకునేందుకు పడిగాపులు

ఎల్లారెడ్డి, నవంబర్ 12 (విజయ క్రాంతి): వానకాలం వరి పంట చేతికి వచనట్టు వచ్చి  అకాల వర్షం ఈదురు గాలులతో వాన కురయడంతో పంట పొలాల్లో, చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోయి అన్నదాత, ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పోసిన ధాన్యం నీట మునిగి పంట నాశనమైతున్నది. రైతులు ఆరుగాలం శ్రమించి పంటను పండిస్తే వరుణుడు కరుణించకుండా కక్ష కట్టినట్టు పంట పొలాలపై అకాల వర్షం కురియడంతో వడగండ్లు రాలడంతో వరిపై ఉన్న వర్గింజలు నేలకు ర్యాలీ రైతులు లబోదిబోమని బేంబల్లెతతున్నారు.

రైతులు తమ పంట పొలాల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి పంటకు పలు రకాల ఎరువులు రసాయనిక ఎరువులు అధిక ధరలతో కూలీలు వేల రూపాయలతో కోత మిషన్ల ద్వారా వరి గింజలను కోసి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి విక్రయించడానికి సిద్ధం చేసి ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం ముందుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం, గన్ని సంచులలో వరి ధాన్యం, సంచులలో నింపి,పెట్టీ వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద,ఉంచడం లారీలు రాక అన్నదాత అవస్తలు తీవ్రంగా నష్టపోతున్నారు.

ధాన్యం కల్లాల వద్ద,రోజుల తరబడి ఆరబెట్టి కుప్పలు పెట్టి లారీలు రాక గోనె సంచులు లేక సమాధానాల పేరిట సగం నష్టపోతున్నారు. ఒకవైపు పంట కోసుకునే సమయానికి ఆకాల వర్షాలు వడగండ్లు రావడంతో మరో రకంగా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల ముందు చూపుతో కొనుగోలు కేంద్రాలను ప్రారంనించినప్పటికీ, కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన రైతుల పంటలను తక్షణమే విక్రయించి, సమయానికి లారీల ద్వారా, తీసుకోవడంలో ఆలస్యం లో రైతులు కాస్త నష్టం వాటిల్లకుండా కొంతమేరకు లబ్ధి పొందుతారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా పంటను వేసుకున్న రైతులు ముందుగానే పంటను కోసుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి పక్షం నుంచి మాసం వరకు ధాన్యం విక్రయించకపోవడం పట్ల తరుగు పేరిట అలాగే ధాన్యం ప్రభుత్వం త్వరితగతిన విక్రయించకపోవడం పట్ల నష్టం వాటిల్లుతుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు మాసాలు కష్టపడి తాను పండించిన పంటను సరిగ్గా విక్రయించుకోకపోవడం సమయం ఉన్న ప్రభుత్వం సహకరించకపోవడం పట్ల రైతులు నష్టపోతున్నారని దానిని ప్రభుత్వం గమనించి రైతులకు వానాకాలం పంట నష్టపోయిన వారికి తూకంలో తేమశాతం పొల్లు వంటి, షరతులు పెట్టకుండా రైతుల వద్ద త్వరితగతిన ధాన్యం విక్రయిస్తే లబ్ధి పొందుతామని కొందరు రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

లారీలు లేక రైతులు ఆందోళన

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట మండలాల్లో వరి పైరు వేసిన రైతులు విపరీతంగా నష్టపోయారని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు కొనుగోలు కేంద్రాల వద్ద పడి కాపులు కాయకుండా పటిష్టంగా త్వరితగతిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినట్లయితే రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు.కనీసం  ప్రభుత్వం ఇక నుంచి వేగంగా కొనుగోలు కేంద్రాల వద్ద నుండి ధాన్యమును సేకరించాలని పలువురు రైతులు అధికారులను, వేడుకుంటున్నారు.

పంట నష్ట పరిహారం అందేనా

మొన్న కురిసిన వర్షానికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట లింగంపేట తాడ్వాయి సదాశివ నగర్ గాంధారి రామారెడ్డి రాజంపేట మండలాల్లో సుమారు వేల ఎకరాల్లో పంట పొలాలు నీరు చేరి నీట మునిగిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వం పలువురు రైతులు వేడుకుంటున్నారు. యాసంగి పంట వేయడానికి పలువురు రైతులు ఒక వైపు సిద్ధం అవుతున్నప్పటికీ,నీట మునిగిన పంట పొలాల రైతులు,పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులు ప్రభుత్వం, ఆర్థిక సహాయం అందిస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం పేద రైతులకు ఆసరా అవుతుందా

వేలాది ఎకరాలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్ర స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వంకు అందినప్పటికీ,యాసంగి పంటల సమయం వచ్చినప్పటికీ ప్రభుత్వం రైతుల పట్ల కనికరించాలని, తీవ్రం గా నష్టపోయిన రైతుల ఆవేదన చెందుతున్నారు.

రేపు.. మాపు అంటున్నరు

నాకు 4ఎకరాల పొలం ఉన్నది. నేను పొలం కోసి సుమారు ఇప్పటికీ మాసం పైన అవుతుంది ఇప్పటికీ నావడ్లు కొనుగోలు కేంద్రం వద్దనే ఉన్నాయి. సీరియల్ పేరిట రేపు మాపు అంటూ జరుపుతున్నారు. ధాన్యం పూర్తిగా ఆరిపోయి తెలిపాటిగా గింజలు మారాయి కనీసం ఇకనైనా ధ్యానం ను విక్రయించాలని, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొంత ధాన్యం సంచులలో నింపి పెట్టారు. లారీలు రాకపోవడం సుమారు వారం రోజులుగా బస్తాలలో ధాన్యం ములిగిపోతుంది. కనీసం లారీలను ఏర్పాటు చేయాలని, సహకార సంఘం అధికారుల ను కోరుతున్నారు.

- మలావత్ శ్రీను, రైతు