10-12-2025 01:39:32 AM
కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు...
ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న త్యాగశీలి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ అన్నారు. సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డీసీసీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అద్యక్షుడు, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి వెనుక ఉన్న అసలు శక్తి సోనియా గాంధీ అని పేర్కొన్నారు. ఆమె ఒక నాయకురాలు మాత్రమే కాదని, దూరదృష్టి, ధైర్యం, త్యాగం, ప్రజల పట్ల మమకారం కలిగిన నిజమైన మాతృమూర్తి అని అన్నారు. ప్రజలు కోరిన మేరకు ఎంతటి రాజకీయ ఒత్తిడులు వచ్చినా, ఎంతటి విమర్శలు ఎదురైనా చివరికి తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి ఆమె తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సోనియా గాంధీ ఎప్పుడూ బలహీన వర్గాలు, మహిళలు, యువత, రైతులు, కార్మికుల కోసం పనిచేసే విధానాన్ని అవలబిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజరెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, జిల్లా మాజీ అధ్యక్షులు సాజిత్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు మల్లేష్, సంతోష్, మునిగేలా నర్సింగ్, అనిల్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు అన్నారు. మామడ మండలం పొన్కల్ గ్రామంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనం గా నిర్వహించారు.
గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన త్యాగశీలి సోనియా అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శోభ నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బీమ్ రెడ్డి, గంగారెడ్డి, నర్సారెడ్డి సెల్కం శేఖర్ కొట్ట శేఖర్, తదితరులు ఉన్నారు.