01-10-2025 12:00:00 AM
ఆలేరు, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): ఆలేరు నియోజకవర్గం నుండి బిఆర్‌ఎస్ పార్టీ అభిమానంతో వలసలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు మండలంలోని శారాజిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ముందుగా వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన్నారు.
మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇచ్చేది బిఆర్‌ఎస్ పార్టీ అన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ రవి, మాజీ సర్పంచ్ రజిని, రేణుక నిరోషా, స్వామి, గణేష్, అంజయ్య బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, మండల సెక్రెటరీ జనరల్ రచ్చ రామనర్సయ, మాజీ ఏఎంసీ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రచ్చ కావ్య, మాజీ ఉపసర్పంచ్ కంథీ మహేందర్, సోషల్ మీడియా మండల కన్వీనర్ శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్, సిద్దేశ్వర్, రవి , బాలయ్య, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆ పార్టీలో చేరిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారని కేవలం సర్పంచ్ టికెట్ కోసమే చేరారని, మిగతావారు టికెట్ ఆశించి చేరారు. కేవలం నలుగురు చేరితే 200 మంది చేరినారు అని చెప్పుకుంటున్న మహేందర్ రెడ్డి, నిజంగానే 200 మంది చేరితే వారి పేర్లను ప్రకటించుకోవాలని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి సవాల్ విసిరారు. పది సంవత్సరాల నుండి ప్రజలను మభ్యపెడుతూ అబద్ధాలు ఆడడం మహేందర్ రెడ్డికి అలవాటే,
అస్తిత్వం కోల్పోయిన బిఆర్‌ఎస్ పార్టీని, ఎలా కాపాడుకోవాలో తెలియక ఇలాంటి ప్రకటనలు ఇకనైనా మానుకోవాలని ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏం ఏ ఏజాజ్, మల్లెల శ్రీకాంత్, బీజాని భాస్కర్, జనగామ ఉపేందర్ రెడ్డి, ఎగిరి శ్రీశైలం మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.