01-10-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
కోదాడ సెప్టెంబర్ 30: స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్ కోదాడ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమలుకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, మహిళలను, నిరుద్యోగులను, సబ్బండ వర్గాలను మోసం చేసిందన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఐకమత్యంగా పని చేసి ఏకాభిప్రాయంతో ఆభర్థులను ఎన్నుకోవాలని అన్నారు. మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మాజీ సర్పంచులు గడుపూడి శ్రీకాంత్, దొంగల లక్ష్మి నారాయణ, పొట్టా విజయ్ కిరణ్, మాజీ pacs చైర్మన్ ముత్తవరపు రమేష్, మాజీ ఎంపీటీసీ గంటా శ్రీనివాస్, మండల నాయకులు దొంతగాని అప్పారావు,బాలేబోయిన వేలాద్రి,
అన్నెం వెంకట్ రెడ్డి,జిల్లా బోసుబాబు, ఉదయ్, కుక్కడపు ఖాజా, కంబాల జగ్గయ్య, గాదె వీరారెడ్డి, కాకుమాను కోటిరెడ్డి,గ్రామశాఖల అధ్యక్షులు గుగులోతు చంద్యా, ముడియాల వెంకట్ రెడ్డి,బాలేబోయిన పాపారావు, మద్దాల అప్పారావు, దాసరి వీరబాబు, షేక్ అబ్దుల్ నభీ, దారావత్ వీరు,బట్టు కోటేశ్వరరావు, పోట్ల సతీష్, బాధవత్ బాబు రావు పాల్గొన్నారు.