12 April, 2026 | 1:17 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫూలే ఆశయాన్ని తుంగలో తొక్కాయి

12-04-2026 12:00 AM

బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు

ముషీరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా నే ట్యాంక్బండ్, పీవి మార్గ్‌లో పూలే విగ్రహాన్ని నెలకొల్పుతామని అట్టహాసంగా తెలి పారని, ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకున్న పూలే విగ్రహానికి జయంతి వేడుకలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే నని బీసీ పొలిటికల్ ఫ్రెండ్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు శనివారం చిక్కడపల్లిలోని ఫ్రంట్ రాష్ట్ర కార్యాల యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్‌లు ఆయిలి వెంకన్న గౌడ్, ఎలుకట్టే విజయ్ కుమార్ గౌడ్,  అం బాల నారాయణ గౌడ్‌లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఒక పక్క వేధి స్తూ పూలే జయంతి వేడుకలను చేస్తుందిన్నారు. చట్టసభల్లో బీసీలకు రావలసిన వా టాను ఇచ్చినప్పుడే పూలేకు అసలైన నివాళి అని వారన్నాన్నారు. కార్యక్రమంలో బీసీ పొ లిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, కన్వీనర్ బైరు శేఖర్, ఎంబీసీ విద్యార్థి సం ఘం రాష్ట్ర నాయకులు బడే సాబ్, నాగభూషణం, హర్షవర్ధన్‌గౌడ్ పాల్గొన్నారు.