18-08-2025 02:13:52 AM
పెద్దపల్లిలో వరంగల్ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు
పెద్దపల్లి ఆగస్టు 17(విజయ క్రాంతి) కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను వెం టనే నిలిపివేయాలని ఆదివాసి హక్కుల పో రాట సంఘీభావ వేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24 న అం బేద్కర్ భవన్ వరంగల్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపుని స్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం కరపత్రం, పోస్టర్ ఆవిష్కరించారు.
వేదిక జిల్లా కన్వీనర్, సమన్వయకర్త ముడిమడుగుల మల్లన్న ఆధ్వర్యంలో జరిగి న ఈ కార్యక్రమానికి పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రా వు హాజరై మాట్లాడుతూ మధ్య భారత దేశం లో ఆదివాసీల యొక్క హత్యాకాండను నిరసి స్తూ ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, పో లీస్ క్యాంపులు ఎత్తివేయాలని, తక్షణమే కా ల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
1/70 యాక్ట్, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, పె సా చట్టం, గ్రామసభ తీర్మానాలు అమలుపరచాలని, ఆదివాసులను చంపే హక్కు ఎవ రికీ లేదని రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవిం చే హక్కును కాలరాయొద్దన్నారు.ఈ దేశ సంపదపై హక్కు కొంతమంది కార్పొరేట్లకు మాత్రమే లేదని, ఈ దేశ సంపద ప్రజలందరిదని తెలియజేస్తూ ఈనెల 24న హనుమ కొండలో(వరంగల్) నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఆదివాసీ హక్కుల కార్యకర్తలు సోనీ సోరీ, బేలబాటియా, రమణా లక్ష్మయ్య, గోడెం గణేష్, పౌర హక్కుల సంఘాల నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొ. డి నరసింహారెడ్డి, ప్రొ. కే. వెంకట్ నారాయణ, ఎన్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు భూర అభినవ్, వామపక్ష పార్టీల నాయకులు జాన్ వెస్లీ, చలప తిరావు, కూనమునేని సాంబశివరావు, పో టు రంగారావు, మల్లేపల్లి ప్రభాకర్, కె. విశ్వనాథ్ పాల్గొంటారని తెలిపారు.
ఈ కా ర్యక్రమంలో పిడీఎం రాష్ట్ర నాయకులు చం ద్ర మౌళి, రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, వేదిక రాష్ట్ర కో కన్వీనర్లు మార్వాడీ సుదర్శన్, కట్టా విశ్వనాథ్, రత్నకుమార్, గుమ్మడి కొమురయ్య, రామిల్ల బాపు, బొడ్డుపల్లి రవి, జిందం ప్రసాద్, వై. లెనిన్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎరుకల రాజన్న, పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బొంకూరి లక్ష్మణ్, నారా వి నోద్, బండారి రాజలింగు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు పులిపాక రవీందర్, గాండ్ల మల్లేశం, స్వామి పాల్గొన్నారు.