4 June, 2026 | 12:40 AM

సీఎం పర్యటన విజయవంతం చేయాలి

04-06-2026 12:08 AM

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల టౌన్, జూన్ 3: ఈనెల 4న జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు.

ధరూర్ మండలం గుడ్డం దొడ్డి రిజర్వాయర్ వద్ద రెండు హెలిపాడ్స్ ను ఏర్పాటు చేయడంతో సీఎంతో పాటు మంత్రులకు స్వాగతం పలికేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. పంపు హౌస్ లోపల సీఎం మీటింగ్ ఉంటుందని, వేదిక, ఇతర ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు మెడికల్ టీం, అంబులెన్స్, ఫైర్ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు.

జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెకట్స్ నోట్స్ తయారు చేసుకోవాలని, జిల్లా ప్రాజెక్టులతో కూడిన ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, కిందకు విద్యుత్ తీగలు వేలాడకుండా సరి చేయించాలన్నారు. సీఎం పర్యటనలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును నియమించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డిఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.