4 June, 2026 | 12:46 AM

మీనమేషాలు!

04-06-2026 12:00 AM
  1. చేప పిల్లల పంపిణీకి నిధులు అరకొరే..  
  2. రూ.120 కోట్ల వరకు అవసరం
  3. కేటాయించింది కేవలం రూ.30 కోట్లు  
  4. గత ఏడాదీ ఇదే పరిస్థితి
  5. ఏటేటా తగ్గుతున్న బడ్జెట్
  6. పథకంపై అనిశ్చితి.. మత్స్యకారుల్లో ఆందోళన

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ఉచి  త చేప పిల్లల పంపిణీపై అనిశ్చితి నెలకొది.ఈ పథకానికి ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ఏటే టా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఇక్కడే చేప పిల్లలను ఉత్పత్తి చేయాలని సర్కార్ ఆశిస్తున్నా.. ఆ మేరకు  కేటాయింపులు ఉండటం లేదు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, జలాశయా ల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి కనీ సం రూ.120కోట్ల వరకు అవసరమని మత్స్యశాఖ అంచనా వేసింది.

కానీ, ప్రభు త్వం కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవడం.. మత్స్యకారులను ఆందోళనకు గురి చేస్తోంది. అవసరం మేరకు నిధులు విడుదల చేయకపోవడంతో పథకంపై శాఖలోనే సందేహాలను రేకెత్తిస్తోంది. సీజన్ సమీపిస్తున్నా పూర్తిస్థాయి నిధులపై స్పష్టత లేకపోవడంతో మత్స్యశాఖ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనగా, చివరి నిమిషం లో ఇతర శాఖల వద్ద తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

ఉత్పాదకత, ఆదాయంపై ప్రభావం

చేప పిల్లల పంపిణీ ఆలస్యమైతే ఉత్పాదకత తగ్గడంతో పాటు వేలాది మత్స్యకార కుటుంబా ల ఆదాయంపై ప్రభావం పడే ప్రమాదం ఉంద ని మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముం దు చేప పిల్లల సరఫరా పూర్తి కావాల్సి ఉం టుంది. కానీ, నిధుల విడుదల ఆలస్యంతో టెం డర్లు, సరఫరా ప్రక్రియలు  నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలో వేలాది మత్స్య సహకార సం ఘాలు ఈ పథకంపై ఆధారపడి ఉన్నాయి. చేప పిల్లల పంపిణీ సకాలంలో జరగక పోతే వచ్చే ఏడాది ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని సంఘాలు ఆందోళన వ్యక్తం ఏస్తున్నాయి. పథ కం ఉండి.. నిధులు లేకపోతే ప్రయోజనం ఏమిటని మత్స్యకారులుఎ ప్రశ్నిస్తున్నారు.

గత ఏడాది బీసీ శాఖ నుంచి నిధులు

మత్స్యశాఖకు ప్రభుత్వం నిధులు ఎక్కువ మొత్తంలో కేటాయించాలని మత్స్యశాఖ సహకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో నిధులు లేకపోవడంతో బీసీ శాఖ నుంచి నిధులు తీసుకోవా ల్సిన దుస్థితి వచ్చిందని గంగపుత్ర సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు.  అధికారులు సైతం పథకాన్ని అమలు చేయడానికి ముందస్తు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. చేప పిల్లల పంపిణీ కాంట్రాక్టర్లకు వ్యవస్థకంటే సంబంధిత మత్స్యసహకార సంఘాల ఖాతాలకే నిధులు జమ చేయాలని కోరుతున్నారు.  

ఇతర శాఖలే ఆధారమా?

గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం అదనపు నిధుల కోసం ఇతర శాఖల బడ్జెట్ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆ నిధులు ఎప్పు డు వస్తాయి? పూర్తిగా వస్తాయా? అన్నది ఇంకా ప్రశ్నార్థ్ధకంగానే ఉంది. మత్స్యరం గం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకం. కానీ, పథకం అమలుకు సరిపడా నిధులు కేటాయించకపోవడం.. ప్రభుత్వ ప్రాధాన్యత లపై ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తక్షణ మే నిధులు విడుదల చేయకపోతే ఈ రంగానికి ప్రమాదం పొంచి ఉంది.