calender_icon.png 9 May, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలకార్మిక వ్యవస్థను నిర్ములించాలి

08-05-2025 12:22:34 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, మే 7 (విజయక్రాంతి) : జిల్లాలోని అధికారులందరు సమన్వయము పనిచేస్తూ బాల కార్మిక వ్యవస్థను నిర్ములించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలిమినేషన్, ఏరాడిక్షన్ అఫ్ చైల్డ్, ఆడాలసెంట్ లేబర్ డిస్ట్రిక్ట్ టాస్క్ పోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడి ఈడు పిల్లలని పనులలో పెట్టుకుంటే యజమానులపై కేసుతో పాటు జరిమానా వేసి చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న 15 రోజుల లోపల తహసీల్దార్ లు, ఎంపిడిఓ లతో మండల స్థాయి టాస్క్ పోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలలో, దుకాణాలలో ఉన్న బాల కార్మికుల్ని గుర్తించాలని అలాగే మున్సిపల్ కమిషనర్లు ట్రేడ్ లైసెన్స్, టాక్స్ వసూలు, శానిటేషన్ చేసేటప్పుడు దుకాణాలలో బాల కార్మికులు ఉన్నారా అనే విషయం పరిశీలించాలన్నారు, గ్రామాలలో పంచాయతీ సిబ్బంది మహిళ సంఘాలు, అంగన్వాడీ టీచర్లు ద్వారా గుర్తించి మండల స్థాయి టాస్క్ పోర్స్ కి వివరాలు తెలిపితే బాల కార్మికుల్ని బడిలో చేర్పిస్థారన్నారు.

ఆపరేషన్ ముష్కాన్, స్త్మ్రల్  నిర్వహించినప్పుడు గుర్తించిన  పిల్లలను వైద్య, ఆరోగ్య శాఖ కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో ధైర్యం నింపి స్త్రీ,శిశు సంక్షేమ శాఖ వారు ద్వారా పునరావాసం కల్పించాలన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వారి పని వేళలో గాని ఇతర సమయములలో గాని ఎక్కడైనా బాల కార్మికులను గుర్తించినచో వెంటనే స్పందించి కంప్లైంట్ చేయడము లేదా 1098 చైల్ హెల్ప్ లైన్ నెంబర్ కి సమాచారం ఇచ్చి బాల కార్మిక నిర్ములనలో భాగస్వాములు కావాలన్నారు.

తదుపరి బాలకార్మిక నిర్మూలనకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.  ఈ సమావేశం లో డి ఆర్ డి ఓ వివి అప్పారావు, డిపిఓ యాదయ్య, డి డబ్ల్యూ ఓ నరసింహారావు, చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రమణ రావు, డి ఎం హెచ్ ఓ కోటాచలం, ఇండస్ట్రీస్ జి యం  సీతారాం నాయక్, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మెప్మా పిడి రేణుక పాల్గొన్నారు.