08-05-2025 12:20:24 AM
యాదాద్రి భువనగిరి మే 7 ( విజయ క్రాంతి ) : రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై మండల స్థాయి బ్యాంకర్ల సమావేశాలు రాజీవ్ యువ వికాసం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక మరియు బ్యాంకు లింకేజ్ ప్రక్రియలను సమీక్షించేందుకు జిల్లాలోని వివిధ మండలాలలో మండల స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యస్.సి. కార్పోరేషన్ జినుకల శ్యామ్ సుందర్ పథకం మార్గదర్శకాలను వివరించారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మండల అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమీషనర్లు, బ్యాంక్ మేనేజర్లు పరస్పర సమన్వయంతో పని చేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల డెస్క్ వెరిఫికేషన్ను ఎంపీడీవో లు మున్సిపల్ కమీషనర్లు సమగ్రంగా పూర్తి చేసి వెంటనే సంబంధిత బ్యాంకర్లకు సమర్పించాలని సూచించారు.
మే 10వ తేదీ లోపు తాత్కాలిక లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ, మైనారిటీల సంక్షేమ అధికారి యాదయ్య మాట్లాడుతూ, బ్యాంకులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు సమన్వయంతో పని చేయాలని, బ్యాంకులకు పంపిన జాబితాలను పరిశీలించి దినసరి పురోగతి నివేదికలను ఎంపీడీవోల ద్వారా ప్రధాన కార్యాలయానికి అందించాలని ఆదేశించారు.
ఈ సమావేశాల్లో అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూర్, మోత్కూర్, చౌటుప్పల్, నారాయణపూర్, రామన్నపేట్, వలిగొండ మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ కె. శివరామకృష్ణ, వంశీ బ్రాంచ్ మేనేజర్లు తదితరులుపాల్గొన్నారు