సిటిజన్ చార్టర్ అమలు చేయాలి
గజ్వేల్, ఆగస్టు 18: తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభం గా, పారదర్శకంగా అందేలా సిటిజన్ చార్టర్ను ఏర్పాటు చేసి పకడ్బందీగా అమలు చే యాలని తెలంగాణ రక్షణ సేన గజ్వేల్ ని యోజకవర్గ ఇన్చార్జ్ కొట్టాల యాదగిరి కో రారు. ఈ మేరకు గజ్వేల్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
రెవెన్యూ డివిజన్ పరిధి లోని అన్ని మండలాల్లో సిటిజన్ చార్టర్ను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసి, అందులో పేర్కొన్న సేవలను నిర్ణీత గడువులో అందించాలని కోరారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనం గా నివాళులర్పించారు. కార్యక్రమంలో మా జీ ఎంపీటీసీ ఎడ్ల నర్సింలు, శ్రీకాంత్, రాజు, మధు, నర్సింలు, మిస్బా, స్వామి, కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






