గంజాయి రవాణాపై ఉక్కుపాదం
సూర్యాపేటలో 8 కేజీల గంజాయి పట్టివేత
హైదరాబాద్ దూల్‌పేటలో 2 కిలోలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ ౨౦ (విజయక్రాంతి)/ సూర్యాపేట: గంజాయి రవాణాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో ౧౦ కిలోల గంజాయిని పట్టుకొని, పలువురిపై కేసు నమోదుచేశారు. సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్డులో బైక్‌పై వస్తున్న ముగ్గురిని తనిఖీ చేయగా, నాలుగు ప్యాకెట్లలో గంజాయి లభించిందని డీఎస్పీ తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సూర్యాపేట పట్టణంలో చింతల చెరువుకు చెందిన యడిదల పవన్ కుమా ర్, శ్రీరామ్‌నగర్‌కు చెందిన మన్నె రాహుల్ అలియాస్ సన్నితోపాటు మరో మైనర్ బాలుడిగా గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేట్‌లోని బాబా ఆలయ సమీపంలో గం జాయి అమ్ముతున్నారనే సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ మహేశ్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఫరూక్ అనే వ్యక్తి వద్ద 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలోని ఆలంఘర్ లో బైక్‌పై దీపక్ రాజ్ అనే యువకుడు 600 గ్రాముల గంజాయిని తీసుకెళ్తుండగా పట్టుకున్నారు.






