31 July, 2026 | 1:10 AM

మానవ అక్రమ రవాణా నిరోధానికి సమాజం, పోలీసుల సమష్టి కృషి అవసరం

31-07-2026 12:00 AM
  1. సైబర్ మోసాలు, విదేశీ నకిలీ ఉద్యోగాలపై అప్రమత్తంగా ఉండాలి
  2. పద్మశ్రీ డాక్టర్ సునీత కృష్ణన్, టీఎస్‌పీఏ డైరెక్టర్ అభిలాష 

రాజేంద్ర నగర్ జూలై 30 (విజయక్రాంతి): ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బి.వి.ఆర్.ఆర్. తెలంగాణ పోలీస్ అకాడమీలో గురువారం ‘మానవ అక్రమ రవాణా మరియు సురక్షిత వలస  అంశంపై పద్మశ్రీ డా. సునీతా కృష్ణన్, ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, అవగాహన సదస్సులో పాల్గని  ప్రసంగించారు. డా. పద్మశ్రీ  సునీతా కృష్ణన్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న సంఘటిత నేరమని, లైంగిక దోపిడి, బాల కార్మికత్వం, బలవంతపు భిక్షాటనం, అవయవాల అక్రమ రవాణా, సైబర్ మోసాలు, నకిలీ విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగే అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సోషల్ మీడియా ద్వారా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ఆన్లైన్ గ్రూమింగ్ వంటి సైబర్ ముప్పులను వివరించి, బాధితుల రక్షణ, పునరావాసం, సమర్థవంతమైన దర్యాప్తు కోసం సూత్రాలను సమిష్టిగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అకాడమీ డైరెక్టర్  అభిలాష్ బిస్త్, ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసు యూనిఫ్పా ప్రజలకు అపార విశ్వాసం ఉందని, ప్రతి పోలీసు అధికారి ఆ విశ్వాసాన్ని నిజాయితీ, వృత్తి నైపుణ్యం, మానవీయ దృక్పథంతో నిలబెట్టాలని అన్నారు.  ఈ కార్యక్రమం లో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ జి కవిత, అసిస్టెంట్ డైరెక్టర్ వేమా శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు ప్రొబేషనరీ డి ఎస్ పి లు,ఇతర ట్రైనీ అధికారులు పాల్గొన్నారు.