30 May, 2026 | 1:50 AM

ఫీల్డ్ విజిట్‌తో హడలెత్తిస్తున్న కలెక్టర్

30-05-2026 12:00 AM

నిర్మల్ మే 29 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న వరీ జొన్న పంటలు ఒకేసారి కి మార్కెట్ కు రావడంతో రైతులకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్ స్వయంగా ఫీల్ పేరుతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న , వరి జొన్న కొనుగోల కోసం రైతులు ఆందోళన చేస్తున్న నేప థ్యంలో క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ రాత్రి పగలనక ఫీల్ విసిట్ చేసి రికార్డులను సరిగ్గా పరిశీలిస్తున్నారు.

ఉదయం ఏడు గంటలకి ధాన్యం కొనుగోళ్లపై పత్రికల్లో వస్తున్న వార్తలను చూ సి అక్కడికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రైస్ మిల్లర్లు గోధుమల వ ద్ద లోడింగ్ అన్లోడింగ్ ప్రాసెస్ పూర్తి చేసేలా పర్యవేక్షణ చేస్తున్నారు. రాత్రి ఎన్ని గంటల వరకు జిల్లాలోని మారుమూల గిరిజన మండలాలైన కుబీర్ కుంటాల పెంబి దస్తురాబాద్ తదితర మండలాల్లో తిరిగి లారీలు కొడత లేకుండా అధికారులకు బాధ్యతలను అప్పగించడంతో ధాన్యం తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

దీంతో జిల్లా వ్యాప్తం గా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైస్ మిల్లర్లు లారీ యజమానులు కలెక్టర్ తనిఖీలతో తమకు సమస్య ఉత్పన్నం కాకుండా ప క్కాగా పకడ్బందీగా అన్ని రికార్డులను సమగ్రంగా రూపొందించుకొని అవసరమైతే కూ లీలను ఎక్కువగా వినియోగించుకుంటు ఉ న్నారు. 

ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించి 24 గంటల ప్రగతి నివేదికను తెప్పించుకుంటున్నారు   రోజువారీగా కొనుగోలు దాన్యం సం టచుల సరఫరా లోడింగ్ అన్లోడింగ్ లా రీల వివరాలు పక్కాగా పరిశీలన చేస్తున్నారు అధికారులు తప్పు చేయకుండా క్షేత్రస్థాయిలో టెక్నికల్ విభాగాన్ని వినియోగించు కుంటున్నారు.