కమిషన్‌ను తప్పుబట్టడం తగదు
- చైర్మన్ వైదొలగాలని బెదిరించడం ధిక్కరణే
కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహారెడ్డిని అవమానిం చేలా మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖ ఆయ న అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఒక ప్రకటనలో విమర్శిం చారు. సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కు చట్టబ ద్ధంగా నియమించిన కమిషన్‌కు గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం సిగ్గు చేటన్నారు. విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేస్తే వాస్తవాలను ముందుంచాల్సింది పోయి కమిషన్‌నే అవమానించడం క్షమించ రాని విషయమన్నారు.
కమిషన్ చట్టవిరు ద్ధమైతే న్యాయస్థానానికి వెళ్లాలని, అంతేకానీ తప్పుబట్టడమేంటని ప్రశ్నించారు. ఎలక్ట్రిసి టీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) నిర్ణయా లపై కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపైనే కమి షన్ విచారణ చేస్తోందని, ఈ విషయం తెలి సి కూడా కేసీఆర్ ఈఆర్సీని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గుచేటని అన్నా రు. తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఎందాకైనా వెళతారని, ఏ స్థాయి వ్యక్తుల ప్రతిష్ఠనైనా దెబ్బతీసేందుకు కేసీఆర్ వెనుకాడరని మండిపడ్డారు. తక్షణమే కేసీఆర్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ అవినీతి, అక్రమాల కేసులో విచారణలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఇది కొత్త అనుమానాలకు దారితీస్తుందన్నారు.






