11 June, 2026 | 5:18 AM

ప్రభుత్వానిది ద్వంద్వవైఖరి

16-06-2024 01:18 AM

బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ 

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు, ఇరిగేషన్ శాఖ ప్రాజెక్టుల ఒప్పందాల్లో అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై విచారణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని బీజేపి రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తీవ్రంగా ఎండగట్టారు. రాష్ర్టం ఆవిర్భవించిన సందర్భంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వివిధ కంపెనీలు, సంస్థలతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో అనేక అక్రమాలు జరిగాయని, ముడుపులు చేతులు మారాయని నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అక్రమార్కులను కాపాడేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడాన్ని ఆయన తప్పుబట్టారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్  ఆధ్వర్యంలో విచారణను మరింత పారదర్శకంగా, సమగ్రంగా చేయాలన్నారు. సమగ్రమైన విచారణ కోసం మరోవారం పాటు గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాసంక్షేమాన్ని పక్కన పెట్టి.. అడ్వాన్స్ బిల్లులను చెల్లించి ఖజానాను ఖాళీ చేసి రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని దివాలా తీయిస్తున్నారని ఆరోపి ంచారు. గాడితప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై రేవంత్‌రెడ్డి బహిరంగ చర్చ కు సిద్దమా అని ప్రభాకర్ సవాలు విసిరారు. రాష్ర్టంలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసేలా సంబంధిత అధికారులతో సమీక్ష సమావే శాలు నిర్వహించాలని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ చురకలు అంటించారు.