9 April, 2026 | 6:59 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

తీర్థయాత్రికులకు ప్రత్యేక రైళ్లు

10-02-2026 01:00 AM

ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ 

మంచిర్యాల, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : తీర్ధ యాత్రలకు వెళ్ళే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఐఆర్‌సీటీసీ టూరిజం సికింద్రాబాద్ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్ తెలిపారు. సోమవారం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో డీపీఆర్‌ఓ యం. కృష్ణమూర్తి, రైల్వే శాఖ అధికారులతో కలిసి రైల్ టూర్ ప్యాకేజెస్ సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21 నుంచి ఏప్రల్ 14 వరకు రెండు ప్రత్యేక ప్యాకేజీలను భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి ప్యాకేజీ (మార్చి 21నప్రారంభమై 28 వరకు)లో దివ్యదక్షిణయాత్ర జ్యోతిర్లింగంతో (తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు) ఉంటుందని, ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ. 14,700, 3 ఏసీ ధర రూ. 22,300, 2 ఏసీ ధర రూ.28,700 ఉంటుందని తెలిపా రు. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట,వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూ రు, గూడూరు, రేణిగుంట మీదుగా కొనసాగుతుందన్నారు. 

రెండవ ప్యాకేజీ (ఏప్రిల్ 14 నుంచి 24 వరకు) సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ( ఉజ్జాయిని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్), ద్వారక నాగేశ్వర్, సోమనాథ్, పూణే భీమశంకర్, నాసిక్ త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్ గ్రీష్ణేశ్వర్)లో ఉంటుందని, ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ. 17,600, 3 ఏసీ ధర రూ. 26,700, 2 ఏసీ ధర రూ. 34,600 ఉంటుందన్నారు. ఈ యాత్ర సికింద్రాబాద్, కామారె డ్డి, నిజామాబాద్ ధర్మాబాద్,

ముద్ఖేడ్ హజూ ర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ మీదుగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి రైలులో 639 మంది ప్రయాణికులు ఉంటారని, ప్రతి 70 మందికి ఇద్దరుసమన్వయకర్తలు అందుబాటులో ఉండి అన్నిసౌక ర్యాలు సమకురుస్తార ని, కోచ్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్, రైలులో సి.సి. కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలిపారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు 9701360701, 9281030727, 9281030759లలో సంప్రదించాలని, వివరాలకు www.irctctourism.com వెబ్‌సైట్ లోసంప్రదించవచ్చని తెలిపారు.