కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు -జక్కిడి శివ చరణ్ రెడ్డి
ఎల్బీనగర్, జూలై 21 : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎరుగురవేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల డివిజన్ అధ్యక్షులను నియమించింది.
ఈ మేరకు మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు బొడిగె స్వామి గౌడ్, లెక్చర్స్ డివిజన్ అధ్యక్షుడు కళ్లెం నర్సింహా రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు అందరిని కలుపుకుని, రాబోయే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అత్యధిక కార్పొరేటర్ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రెడ్డి, నగేశ్, ఎర్ర మహేందర్, జక్కిడి సత్యతేజ రెడ్డి, నర్సింహా రావు, సుక్క వెంకటేశ్, విఠల్ రెడ్డి, యాదగిరి, కృష్ణ గౌడ్, రాము, రఘుపతి, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






