కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
02-12-2024 05:33 PM
సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి
సంగారెడ్డి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడం జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు




