3 June, 2026 | 1:45 AM

హెచ్‌ఎండీఏలో ఆవిర్భావ వేడుకలు

03-06-2026 01:12 AM

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మంగళవారం అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులో ఘనంగా నిర్వహించింది.

హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆదేశాల మేరకు, హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (జనరల్), కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) శ్రీవత్స కోట జా తీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. శ్రీవత్స కోట మా ట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల సం క్షేమం కోసం ప్రతి పౌరుడు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర లక్ష్యాలు, ఆకాంక్షలను సాకారం చేయడంలో హెచ్‌ఎండీఏ ఉద్యోగులందరూ అంకితభావంతో, ని బద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ జాయింట్ మె ట్రోపాలిటన్ కమిషనర్ (పెరి-అర్బన్ రీజియన్) ఆర్.ఉపేందర్‌రెడ్డి, జాయింట్ మెట్రో పాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్) టి. వెంకన్న, చీఫ్ ఇంజనీర్ బి. రవీందర్, హెచ్‌జీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సిహెచ్. పరమ్ జ్యోతి, డైరెక్టర్ (ప్లానింగ్) కె. విద్యాధర్, డైరెక్టర్ (ప్లానింగ్) కె. యశ్వంత్ రావు, డైరెక్టర్ (ప్లానింగ్) కె. వికాస్ పాల్గొన్నారు.