calender_icon.png 17 January, 2026 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

17-01-2026 12:52:00 AM

ధర్మపురిలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్

ధర్మపురి, జనవరి : ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలనీ జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను అదేశించారు. శుక్రవారం ధర్మపురి మండలకేంద్రంలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి తెలంగా ణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందన్నారు.ఇటుక, కంకర ధరల నియంత్ర ణకు, ఇండ్ల లబ్ధిదారులకు ధరలు అనుగుణంగా ఉండేలా అధికారులు కమిటీ ఏర్పా టు చేసుకోవాలని సూచించారు .ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెనుకబడి ఉన్నట్లయితే వేగవంతం పెంచాలని,గడువులోపు వారికి కేటాయించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకుఆర్థిక పరమైన సమస్యలుంటే ఐకేపి, మెప్మా సహకార సం ఘాల ద్వారా రుణాలు పొందాలని సూచించారు.ఈకార్యక్రమంలో ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, హౌసింగ్ డిఈ భాస్కర్, ఎమ్మార్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.