calender_icon.png 17 January, 2026 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన

17-01-2026 11:51:06 AM

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో(Mahabubnagar) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు (CM Revanth Reddy) పర్యటించనున్నారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రాంగణంలో ఐఐఐటీ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి విద్యార్థులతో ముచ్చటిస్తారుమహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఆయన మున్సిపాలిటీలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఆయన అదే వేదికపై జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు  చేశారు.