17-01-2026 12:49:16 AM
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మొండి చేయి
మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో ఒక్క కౌన్సిలర్ పదవి కేటాయించలే!
మహబూబాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే ము న్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు మళ్ళీ ముందు చేయి దక్కింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్, మరిపె డ, కేసముద్రం, తొర్రూరు, డోర్నకల్ ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మహబూబాబాద్ లో 36, కేసముద్రంలో 16, తొర్రూరులో 16, మరిపెడలో 15 డోర్నకల్ లో 15 వార్డులు ఉన్నాయి. మొత్తం 98 వా ర్డుల్లో బీసీ కేటగిరీలో మహిళలు, పురుషులకు కలిపి మహబూబాబాద్ లో 6, కేసము ద్రంలో 3, తొర్రూరులో 3 వార్డులు కేటాయించగా, డోర్నకల్, మరిపెడ ము న్సిపాలిటీలో బీసీలకు ఒక్క సీటు కూడా కే టాయించలేదు.
గత సర్పంచ్ ఎన్నికల్లో కూ డా జిల్లావ్యాప్తంగా 482 సర్పంచ్ పదవుల్లో కేవలం 19 మాత్రమే బీసీలకు కేటాయించా రు. పంచాయతీ ఎన్నికల్లో డోర్నకల్, మరిపెడ మండలంలో ఒక్క సర్పంచ్ స్థానం కూ డా బీసీలకు కేటాయించలేదు. ఇప్పుడు ము న్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో ఒక్క వార్డు కౌన్సిలర్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదు. దీంతో మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలు జనరల్ స్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
2011 జనాభా లెక్కలు, 2019 మున్సిపల్ చట్టం ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు అధికార వర్గాలు చెబుతుండగా, బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో జరిగినట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో జరి గిన విధంగానే అన్యాయం జరిగిందని, జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి గెలిచే పరిస్థి తి అంతగా ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఆశించడం అం తగా కేటాయింపులు లేకపోవడం వల్ల కనీ సం పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలని, లేని పక్షంలో బీసీలకు రా జకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని ప్రభుత్వం ప్రక టించింది. ఆ విధంగా రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. పంచాయతీ ఎన్నికల్లో బీసీ లకు రిజర్వేషన్లు అమలు చే యకపోవ డం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూ డా అదే తరహాలో రిజర్వేషన్లు దక్కకపోవడం, బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేయడం సరైనది కాదు. ప్ర భుత్వం ఎన్నికలకు ముందు ఇ చ్చిన హా మీ ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన త ర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. లేని ప క్షంలో బీసీలను రాజకీయాలనుండి దూ రం చేసే కుట్రలను తిప్పి కొట్టడానికి సం ఘటితంగా ఉద్యమిస్తాం.
డి.ముఖేష్, బీసీ సంఘం
అధ్యక్షుడు, తానంచర్ల